చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల నిర్వహణపై తీవ్రంగా ఆగ్రహించిన ఎమ్మెల్యే జారె
చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల నిర్వహణపై తీవ్రంగా ఆగ్రహించిన ఎమ్మెల్యే జారె
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి ఆగష్టు 2
02.08.2025 - శనివారం
హెచ్ఎమ్ తో పాటు హాస్టల్ వార్డెన్ ను తక్షణమే విధుల నుంచి తొలగింపు వారిపై చర్యలకు ఉన్నతాధికారులకు ఆదేశం
దమ్మపేట మండలం
చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్ నిర్వాహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రధాన ఉపాధ్యాయులుతో పాటు హాస్టల్ వార్డెన్ ను తక్షణమే విధుల నుంచి తొలగించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా విద్యార్థుల రిజిస్టర్ లో అవకతవకలను గుర్తించి పద్దతి మార్చుకోవాలని ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు అలాగే మెనూ ప్రకారం భోజనం అందించాలని నాసిరకం కూరగాయలు సరుకులు వాడితే తమరిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు నాసిరకం కూరగాయలు అందించే కాంక్రాక్ట్ రద్దు చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధికారులకు తెలిపారు హాస్టల్ నిర్వహణ సరిగ్గా లేదని నేను మళ్ళీ వచ్చేసరికి అన్ని విషయాలు మెరుగుపరచాలన్నారు ప్రభుత్వ లక్ష్యాలను నీరుగార్చవద్దని హెచ్చరించారు
Comment List