క్లింకార న్యూస్ కోహీర్ మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ చేసిన జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి
క్లింకార న్యూస్
కోహీర్ మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ చేసిన జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి
మండల కేంద్రమైన కోహిర్ లోని మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్ ను జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి,
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి. కవిత దేవి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి విద్యార్థులతో ఇంటరక్ట్ అయ్యి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో కనీసవసతులు లేవని హాస్టల్ యాజమాన్యపై మండిపడ్డారు. హాస్టల్ లో చీకటి గదులు, అధిక స్ట్రెంత్, వేంటిలేషన్ లేకపోవడంతో ఆ ప్రాంగణం అంతా దుర్వాసనతో ఉండడాన్ని గమనించారు. ఇటీవల హాస్టల్ లో విద్యార్థిని మృతి చెందినదని జడ్జి గారి దృష్టికి రావడంతో ఈ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సమస్యలపై అధికారులతో మాట్లాడి వీలయినంత త్వరలో సమస్యలపై తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు సోమశేఖర్, జగన్, తుల్జారాం, జనార్దన్, శివ కుమార్, లీగల్ సర్వీసెస్ సిబ్బంది. పారాలీగల్ వాలంటీర్ పాల్గొన్నారు.
Comment List