బీసీలపై కపట నాటకం – కాంగ్రెస్‌ను ఖండించిన బీజేపీ నేత అరుణ్‌రాజ్ శేరికర్ నారాయణఖేడ్, జూలై 31: బీసీ ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం
బీసీలపై కపట నాటకం – కాంగ్రెస్‌ను ఖండించిన బీజేపీ నేత అరుణ్‌రాజ్ శేరికర్
నారాయణఖేడ్, జూలై 31: బీసీ ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకం ఆడుతోందని, హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరుణ్‌రాజ్ శేరికర్ తీవ్రంగా విమర్శించారు. గురువారం మున్సిపల్ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 2న హైదరాబాద్‌లోని ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే బీసీ హక్కుల ధర్నాలో భారీగా పాల్గొనాలని ఆయన బీసీ నాయకులకు పిలుపునిచ్చారు.ఎన్నికల సమయంలో కామారెడ్డి నియోజకవర్గంలో బీసీలకు ప్రత్యేక డిక్లరేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక మాట మరిచింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి దమ్ము లేకపోవడంతో బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఇచ్చేలా మార్గం సిద్ధం చేయకపోగా, బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నది," అని ధ్వజమెత్తారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టి, మోసం చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ డ్రామాలను గుర్తిస్తున్నారని, వారి పట్ల నమ్మకం కోల్పోయారని అన్నారు.
"బీసీలను అసలైన న్యాయం పొందే దిశగా పోరాటం కొనసాగుతుంది. ఈ ఉద్యమంలో ప్రతి బీసీ నాయకుడు భాగస్వామ్యం కావాలి" అని పిలుపునిచ్చారు.
Comment List