అశ్వరావుపేట చరిత్రలో నిలిచిపోయేలా జిల్లా మహాసభలు క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 29
.అశ్వరావుపేట చరిత్రలో నిలిచిపోయేలా జిల్లా మహాసభలు
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 29
భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సయ్యద్ సలీం ఉద్వేగపూరిత ఉపన్యాసం చేశారు, ప్రస్తుత రాజకీయ, పార్టీ పరిణామాలను వివరిస్తూ, అశ్వరావుపేట నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను గుర్తు చేస్తూ సాగిన ఆయన ఉపన్యాసం అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సయ్యద్ మియా జానీ చెన్నారెడ్డి బద్దె రాములు వంటి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి తగిన గుర్తింపు ఇవ్వాలంటూ మరియు పార్టీ విధివిధానాలను నూతన వడంబడికతో ముందుకు తీసుకువెళ్లాలని, ప్రత్యక్ష రాజకీయా లలో ప్రత్యర్థులను ఎదుర్కొనేలా తగిన వ్యూహాలను రచించాలని తద్వారా వీలైనన్ని స్థానాల్లో మన అభ్యర్థులను గెలిపించుకునే విధంగా పనిచేయాలని ఆయన అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీకి యువ నాయకత్వం ఎంతో అవసరం అని, యువ నాయకత్వాన్ని తయారు చేసేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని, తద్వారా సిపిఐ పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలని ఆయన
పూర్వ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అదేవిధంగా పార్టీ నాయకులను గుర్తు చేసుకుంటూ ఆయన ఉపన్యాసం సాగింది.ఆయన ఉద్వేగబరితంగా చేసిన ఉపన్యాసం అందరిని అబ్బురపరిచింది,ఆయన ఉపన్యాసంతో మొదలైన మహాసభలు సుమారు 700 మంది సిపిఐ నాయకులు,ప్రతినిధులతో పార్టీ విధివిధానాలు, తీర్మానాలు,కార్యాచరణలతో కూడిన ఉపన్యాసాలతో రెండు రోజులు జులై 26 27 విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి అశ్వరావుపేట మండల పట్టణ సిపిఐ నాయకులు కార్యకర్తలు ఎంతో శ్రమపడి మహా సభలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో అశ్వరావుపేట పట్టణాన్ని రంగ రంగ వైభవంగా ముస్తాబు చేశారు. మహాసభలు విజయవంతంగా పూర్తి కావడంతో అశ్వరావుపేట నియోజకవర్గ సిపిఐ పార్టీ శ్రేణులు సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.సుమారు 40 సంవత్సరాల తర్వాత అశ్వరావుపేటలో జరిగిన ఈ జిల్లా మహాసభలు అశ్వరావుపేట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభలను విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి సిపిఐ కార్యకర్తకు నాయకునికి అభిమానికి పేరుపేరునా విప్లవ ధన్యవాదాలు.
Comment List