ములకలపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో హై కోర్టు అడ్వకేట్స్ మరియు మద్దిశెట్టి బృందం. క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై
ములకలపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో హై కోర్టు అడ్వకేట్స్ మరియు మద్దిశెట్టి బృందం.
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 29
హైదరాబాద్ హై కోర్ట్ అడ్వకేట్స్ ప్రశాంత్ గడిపే, రవి కుమార్ మరియు ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు మరియు వారి బృందం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పొగళ్ళపల్లి గ్రామానికి చెందిన కొత్తూరు జానయ్య, భూమి సర్వే నంబరు 269 లో గల 14 ఎకరాల 18 గుంటల భూమిని కొలిచి అప్పచెప్పాలని ఎమ్మార్వో గన్యా నాయక్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఎమ్మార్వో స్పందించి సర్వేయర్ లేరని వారు రాగానే కొలిచి అప్పచెప్తామని ఎమ్మార్వో తెలిపారు. అదే విధంగా ఫారెస్ట్ రేంజర్ రవి కిరణ్ ని కూడా కలవడం జరిగింది. ఫారెస్ట్ రేంజర్ కూడా సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చి సర్వే కి సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గాదె సత్యం, పలగాని శ్రీనివాసరావు గౌడ్, పర్స సతీష్ కుమార్ గౌడ్, దొడ్డ లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Comment List