*రిమ్స్ కార్మికుల ESI PF మరియు వేతనం చెల్లించాలి*
*రిమ్స్ కార్మికుల ESI PF మరియు వేతనం చెల్లించాలి*
*IHFMS కాంట్రాక్టు విషయంలో నెలకొని ఉన్న గందరగోళాన్ని తొలగించాలి*
*అన్నమొల్ల కిరణ్ సిఐటియు జిల్లా కార్యదర్శి*
క్లింకారా న్యూస్/ ఆదిలాబాద్ జిల్లా : రిమ్స్ లో పనిచేస్తున్న ఐ హెచ్ ఎఫ్ ఎం ఎస్ కాంట్రాక్టు కార్మికుల పిఎఫ్ ఎస్ఐ మరియు జూన్ నెల వేతనాన్ని వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ అన్నారు. రిమ్స్ కార్మికులతో కలిసి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ రిమ్స్ కమిటీ ఆధ్వర్యంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ గారికి వినతిపత్రం అందించారు.
రిమ్స్ ఆస్పత్రిలో ఐ హెచ్ ఎఫ్ ఎం ఎస్ కాంట్రాక్టు కాలం ముగిసిందని సదరు కాంట్రాక్టర్ గడువు ముగిసిందని పత్రికా ముఖంగా ప్రకటించారు. సదరు కాంట్రాక్టర్ కూడా సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి సస్పెండ్ చేస్తూ గౌరవ హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకుని వచ్చారు. ఈ పరిస్థితులలో ఐ హెచ్ ఎఫ్ ఎం ఎస్ కార్మికుల వేతనాలు మరియు పిఎఫ్ ఈఎస్ఐ ఎవరు చెల్లిస్తారు అనేది గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నది. ఈరోజు పిఎఫ్ ఎస్ఐ చెల్లింపునకు ఆఖరి తేదీ ఉన్నది. కావున కార్మికుల్లో నెలకొని ఉన్న ఆందోళనలను తొలగిస్తూ ఐ హెచ్ ఎఫ్ ఎం ఎస్ కార్మికుల బాధ్యత ఎవరిది అనేది స్పష్టం చేయాలని కోరుతున్నాము. జిల్లా కలెక్టర్ గారు రిమ్స్ డైరెక్టర్ గారు స్పందించి కార్మికుల పిఎఫ్ ESI మరియు ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లించిన మాదిరిగానే జూన్ నెల వేతనం కార్మికుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో రిమ్స్ కార్యదర్శి పెర్క దేవిదాస్ నాయకులు సురేందర్ పొచ్చన్న ఖలీల్ రమేష్ రమాకాంత్ దశాంత్ వినీత్ ఇమ్రాన్ రాజు రాము పోతన్న తదితరులు పాల్గొన్నారు
Comment List