ఈనెల 24న జిల్లాకు మందకృష్ణ మాదిగ రాక క్లింకారా న్యూస్, జూలై 18 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఈనెల 24న జిల్లాకు మందకృష్ణ మాదిగ రాక
క్లింకారా న్యూస్, జూలై 18 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
హామీలకే పరిమితమైన ప్రభుత్వం
వికలాంగులు, చేయూత పింఛన్దారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రభుత్వంపై యుద్ధం
ములకలపల్లి రవిమాదిగ
తేది : 18/07/2025.
అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ములకలపల్లి రవి మాదిగ హాజరై మాట్లాడుతూ వితంతువు. వికలాంగులు.వృద్ధాపప్య. వంటరి మహిళల, హెచ్ఐవి. బోదకాలు.బాధితులకు తక్షణమే పెన్షన్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన విధంగా పెంచాలని డిమాండ్తో ఈనెల 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరగబోయే పెన్షన్దారుల జిల్లా స్థాయి మహాసదస్సును విజయవంతం చేయాలని ఈ సమావేశానికి గౌరవనీయులు మహా జననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు హాజరుకానున్నారు,, కావున జిల్లా నలుమూలల నుండి పెన్షన్ దారులు అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం,
ఈ సమావేశంలో ఎమ్మెస్ పి సీనియర్ నాయకులు దేపంగి రమణయ్య మాదిగ, కోలేటి పకీరయ్య మాదిగ, నార్లపాటి శ్రీను మాదిగ, తగరం ఏసు రత్నం, చిలక చిరంజీవిమాదిగ, చంగల గురునాథం మాదిగ, గాలంకి అశోక్ మాదిగ, జిల్లా సమన్వయం కర్త కొత్తపల్లి సోమయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఈసంపల్లి కృష్ణ మాదిగ, నలగంటి వెంకన్న మాదిగ, తదితరులు పాల్గొన్నారు
Comment List