న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ

On
న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ

న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి
కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ

క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 16
కొత్తగూడెం లీగల్: న్యాయవాదుల సంక్షేమానికి కొత్త కోర్టులు,హెల్త్ కార్డులు, గృహ స్థలాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా నూతన న్యాయస్థానాల ఏర్పాటుకు కృషి చేయాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ కోరారు.బుధవారం న్యాయవాదుల సంఘం లైబ్రరీ హాల్ నందు కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు వెల్లంకి వెంకటేశ్వరరావు అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోతుకురీ ధర్మారావు,నాగ సీతారాములు,రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర కమిటీ సభ్యులు జే.బీ.శౌరి, జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,ఉమ్మడి జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావుల ద్వారా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఎస్సీ-ఎస్టీ కోర్టు,ఫ్యామిలీ కోర్టు,లేబర్ కోర్టు వంటి నూతన న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల, గవర్నమెంట్ ప్లీడర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,కొత్తగా నోటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని,2019 తర్వాత ఎన్రోల్ అయిన ప్రతీ న్యాయవాదికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని,ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డ్ ల పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని కోరారు.అలాగే అర్హులైన న్యాయవాదులకు గృహ స్థలాలు మంజూరు చేయాలని,న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా ముందుకు వస్తుందని,నూతన న్యాయస్థానాల ఏర్పాటుతో పాటు వాటికి సంబంధించిన న్యాయసౌధాల నిర్మాణం,న్యాయమూర్తుల నివాస గృహాల నిర్మాణం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తామని సన్మాన గ్రహీతలు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భాగం మాధవ్ రావు,రేపాక వెంకటరత్నం,పలివెల సాంబశివరావు,వి.వి.సుధాకర్ రావు,వై.వి.రామారావు,రావి విజయ్ కుమార్,ఊట్ల రాజేశ్వరరావు,ఎర్రపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250716-WA0083

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'