జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా.
జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన తేది: 15.07.2025,
*• ఉద్యోగి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది సహజం..*
*• పదవి విరమణ పొందిన ఎస్ఐలు షేక్ షాబుద్దీన్, కే.మల్లయ్య లను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ శ్రీ. పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.*
జూన్ 30న పదవి విరమణ పొందిన షేక్ షాబుద్దీన్, కే.మల్లయ్య ఎస్ఐ లను ఈ రోజు తేదీ 15- 07- 2025 నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ఘనంగా సత్కరించి, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జూన్ 30 నిర్వహించవలసిన ఈ వీడ్కోలు సమావేశం సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది అన్నారు. షేక్ షాబుద్దీన్ (1983), కే.మల్లయ్య (1984) లో జిల్లా పోలీసు శాఖలో పోలీస్ కానిస్టేబుల్స్ గా నియామకమై గడిచిన 42 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లలో సాదారణ విధులతో పాటు, క్రైమ్ డ్యూటీ లను నిర్వహించడం జరిగింది. ఎన్నో విపత్కర పరిస్థితులలో తమకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తూ సర్వీస్ లో ఏ చిన్న రిమార్క్ లేకుండా అంచలంచాలుగా పదోన్నతులు పొందుతూ.. సబ్-ఇన్స్పెక్టర్స్ గా పదోన్నతులు పొందడం జరిగింది అన్నారు.
వారు పోలీసు శాఖకు అందించిన సేవలు మారువలేనివని వారి సేవలను కొనియాడారు. రిటైర్మెంట్ అనంతరం పోలీసు శాఖ నుండి రావలసిన అన్నిరకాల రిటైర్మెంట్ బెన్ఫిట్స్ సకాలంలో అందేవిధంగా చూస్తామని, రిటైర్మెంట్ అనంతరం కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మిగిలిన శేష జీవితం వారి కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అన్నారు. పోలీస్ శాఖ తరపున వారికి, వారి కుటుంబాలకు ఎల్లవేళలా సహాయ, సహకారం అందింస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, వర్టికల్ డిఎస్పీ శ్రీనివాస రావ్, ఆర్.ఐ డానియల్ తదితరులు పాల్గొన్నారు.
Comment List