జిల్లా పోలీస్ కార్యాలయం,            సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన - తేది: 18-07-2025,

On
జిల్లా పోలీస్ కార్యాలయం,            సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన - తేది: 18-07-2025,

జిల్లా పోలీస్ కార్యాలయం,  
         సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన - తేది: 18-07-2025,

*•    పోలీసులలో ప్రతిభను వెలికి తీయడానికే పోలీసు డ్యూటి మీట్స్..* 
*•    జోనల్ డ్యూటి మీట్ నందు ప్రతిభ చాటిన సంగారెడ్డి, వికారాబాద్ పోలీసు అధికారులు, జాగిలాలను రాష్ట్ర స్థాయి డ్యూటి మీట్ కు ఎంపికా..*    
*•    రాష్ట్ర స్థాయి డ్యూటి మీట్ నందు సత్తా చాటాలి.. జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపియస్ గారు.* 

జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా ఈ రోజు తేది: 18-07-2025 నాడు సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జోనల్ డ్యూటి మీట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపియస్ గారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. గత నెలలో నిర్వహించిన జిల్లా స్థాయి డ్యూటీ మీట్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ కు ఎంపిక చేయడానికి, జోన్-VI లో కమిషనరేట్స్ మినహా సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు చెందిన 58-మంది అధికారులు, సిబ్బందికి, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోసల్ టీంలకు ఈ రోజు జోనల్ లెవెల్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది. జోనల్ డ్యూటి మీట్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 26-07-2025 నాడు వరంగల్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి డ్యూటి మీట్ కు ఎంపిక చేయడం జరుగుతుందిని అన్నారు. 

పోలీసుల ప్రతిభను వెలికి తీయడానికే పోలీసు డ్యూటి మీట్.. నిర్వహించడం జరుగుతుందని ఈ డ్యూటీ మీట్ నందు సైంటిఫిక్ ఎవిడెన్స్, నేరం జరిగిన తర్వాత నేరస్థలాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, నేరస్థలం నందు క్లూస్ ఏ విధంగా సేకరించాలి, కంప్యూటర్ పరిజ్ఞానం, మరియు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పని తీరుపై పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ నెల 26 న వరంగల్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ నందు సత్తా చాటి, అనంతరం పూనే లో జరిగే నేషనల్ స్థాయి డ్యూటి మీట్ కు అర్హత సాధించాలి అన్నారు. 

పోలీసుల పనితీరుకు అద్దం పటె ఇన్వెసిగేషన్ లో మెళకువలు ఈ డ్యూటి మీట్ ద్వారా మరింత మెరుగ్గా నేర్చుకోవచ్చు అన్నారు. సరైన పద్ధతిలో ఇన్వెసిగేషన్ చేసి కేసును డిటెక్ట్ చేసినట్లయితే ప్రజలలో పోలీసుల పై నమ్మకం పెరుగుతుంది అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎస్పీ గారి వెంబడి డ్యూటి మీట్ నోడల్ అధికారి అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, డీసీఆర్బీ డియస్పి శ్రీనివాస్ రావ్, ఎ.ఆర్.డియస్పి నరేందర్, వికారాబాద్ డ్యూటి మీట్ నోడల్ అధికారి ఎ.ఆర్.డియస్పి వీరేష్, యస్.బి ఇన్స్పెక్టర్స్ విజయ్ కృష్ణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్స్ రమేష్ డ్యూటి మీట్ అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

IMG-20250718-WA0101

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'