కామిక ఏకాదశి రోజున వికాస తరంగిణి వారి శ్రీ విష్ణు పారాయణం క్లింకారా న్యూస్ జూలై 21
కామిక ఏకాదశి రోజున వికాస తరంగిణి వారి శ్రీ విష్ణు పారాయణం
క్లింకారా న్యూస్ జూలై 21
తేదీ. 21.7. 2025 సోమవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు మల్యాల కిరణ్ మయి వినయ్ కుమార్ దంపతుల గృహములో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి వారి మంగళశాషనాలతో శ్రీ లక్ష్మీ అష్టోత్తర విష్ణు సహస్రనామ పారాయణం కామిక ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని వికాస తరంగిణి నర్సంపేట శాఖ మహిళలు సభ్యుల మధ్య నర్సంపేట నడి బొడ్డున పారాయణం మరియు భజన ఘనంగా జరిగింది, ఇట్టి ఆధ్యాత్మిక వేడుకలో అధ్యక్షులు కృష్ణా రావు మాట్లాడుతూ ప్రతి హిందువు ఆధ్యాత్మిక భక్తి ఉద్యమంలో పాల్గొనాలని ఇంటింట భక్తితో దైవ పారాయణం వల్ల మనస్సు శాంతియుతంగా ఉంటుందని, కార్యదర్శి రంగనాధ స్వామి మాట్లాడుతూ ఉపవాసం
ఆషాఢ మాసములో కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏకాదశి సమయంలో మనసులో మనం ఏదైనా కోరికలు కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల తాము చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుందని భావిస్తారు. కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారని తాము చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుందని భావిస్తారు. కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. లేత తులసి దళములతో చేసే శ్రీమన్నారాయణుని ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించివేస్తుంది. కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయని చెప్పారు ఆతిద్యం ఇచ్చిన మల్యాల కిరణ్మయి వినయ్ దంపతులకు మరియు వచ్చిన అందరికి మంగళశశానాలు తెలిపి తీర్ధ ఘోస్టి తొ కార్యక్రమం సుసంపన్నం ఐనది,మహిళలు ఒకరికొకరు కుంకుమ బొట్టు పలకరింపు చేసుకున్నారు. సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు
Comment List