వర్షాకాలంలో_వైరల్_ఇన్ఫెక్షన్స్_రాకుండా_పిల్లల_విషయంలో_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు
వర్షాకాలంలో_వైరల్_ఇన్ఫెక్షన్స్_రాకుండా_పిల్లల_విషయంలో_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు
వాతావరణంతడిగా మారిపోయింది. చినుకుల మాటున చింత కూడా దాగి ఉందని తెలుసుకుంటే మంచిది.
ఒక వారం రోజుల నుంచీ వాతావరణ పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది, ఇలా ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్‌ఫెక్షన్లు దాడిచేస్తాయి, చల్లగా ఉన్న వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్‌లో వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాల ప్రభాదం తీవ్రంగా ఉంటుంది. ప్రతి పదిమందిలో ముగ్గురు- నలుగురికి జలుబు, ఇద్దరు-ముగ్గురికి జ్వరంతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
వైరల్_ఫీవర్_అంటే_ఏమిటి ?
వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా సోకుతాయి. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 102 డిగ్రీల జ్వరం ఉంటుంది. జ్వరం 102 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పుల మధ్య రోగి నిస్సత్తువగా మారిపోతారు. కొందరిలో ఒంటిమీద దద్దుర్లు, వాంతులు, అరుదుగా విరేచనాలూ కనిపిస్తాయి. కొందరిలో జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే జ్వరాలు వేధిస్తుంటాయి. సాధారణంగా వీటిని ‘విష జ్వరాలు” అంటారు. వాటంతట అవే తగ్గిపోయే సాధారణ వైరల్ జ్వరాలూ కూడా కొన్నిఉంటాయి. అలాగే తప్పనిసరిగా చికిత్స తీసుకోవల్సిన మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటివీ వైరల్ ఫీవర్ క్రిందికే వస్తాయి.వివరాలు కు లింక్స్ లో చూడాలి
వైరల్_ఫివర్స్_ఎందుకు_వస్తాయి ?
వైరల్ ఫీవర్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు శ్వాసనాళాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు కూడా వైరల్ ఫీపర్స్ విజృంభిస్తాయి. చల్లదనం తీవ్రత పెరగడం వల్ల రక్సనాళాలు కుంచించుకుపోతాయి . దీంతో రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తీ తగ్గిపోతుంది. ఈ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు, పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. జన సముదాయం ఎక్కువగా ఉన్నచోట వైరస్ ఎక్కువగా లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జ్వరాలు పిల్లల్లో త్వరగా వ్యాప్తి చెందుతాయి.
వైరల్_ఫీవర్_లక్షణాలు_ఏమిటి ?
వైరల్ ఫీవర్ సోకితే ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం,నిస్సత్తువ, స్కీన్ రాషెస్, వికారం, తలనొప్పి, ఆకలి మందగించడం, గొంతునొప్పి, ముక్కు కారడం,దగ్గు, గొంతు నొప్పి, ఉదరంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపకరిస్తాయి.
వైరల్_ఫీవర్_ప్రభావాలు_ఏమిటి ?
శరీరంలోని కణాల మీద వైరస్ ఎటాక్ అవుతుంది. చాలా వరకు వైరల్ ఫీవర్ వల్ల శరీరం పైభాగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. వైరస్ చాలా పవర్ ఫుల్ గ ఉంటె నరాల మీద ప్రభావితం చేస్తుంది. దానితో వివిధ రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది . పేషెంట్ బలహీనంగా మారిపోతారు. ఆహారం పూర్తిగా తీసుకోలేరు.
రోగ_నిరోధక_శక్తిని_పెంచుకోవడం_ఎలా ?
వ్యాధి నిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడంలో మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు చాయ్, బిస్కెట్, సమోసా వంటివి అలవాటు చేయొద్దు. స్నాక్స్ బదులుగా పండ్లు తినిపిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.నిమ్మ, నారింజ వంటి సిట్రస్ జాతి ఫలాలను ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చ
ఆలివ్_ఆయిల్
పిల్లలలో అయినా, పెద్దలలో అయినా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వలన జ్వరం ఉంటుంది. ఆ ఉషోగ్రతను తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ ను శరీరానికి రాసి మసాజ్ చేయాలి. కాటన్ దుస్తులు మరియు పలుచటి వస్త్రం కప్పి పడుకోబెట్టాలి. రెండేళ్లలోపు పిల్లలకు ఈ విధంగా చేయవచ్చు.
తడి_సాక్స_తో_జ్వరానికి_వైద్యం
సాధారణం జ్వరం అయితే ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గిపోతుంది. శరీర వేడి తగ్గడానికి కాటన్ సాక్స్ తీసుకుని చల్లని నీటిలో ఉంచి పాదాలకు తొడిగి విశ్రాంతి తీసుకోవడం వలన శరీర వేడి తగ్గుతుంది. సాక్స్ ఆరిన తర్వాత మళ్ళీ వేస్తూ ఉండాలి.
కలబంద_రసం
కలబంద రసం లేదా జామ ఆకు నుండి తీసిన రసం తల నుదుటిపై రాయడం వలన శరీరవేడి తగ్గుతుంది.
వేడినీటితో స్నానం.గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం బాడీ ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. ఫలితంగా జ్వరం వెంటనే తగ్గుతుంది.తల మెడ భాగంలో ఒక పలుచటి వస్త్రాన్ని తీసుకుని నీటిలో తడిపి తల, మెడ భాగంలో వేయడం వలన శరీరా ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆరిన తర్వాత మళ్ళీ వేయడం చేయాలి.
వర్షా_కాలం_పిల్లలకు_వచ్చే_జబ్బులను_ఇంట్లోనే_నయం_చేసే_ఆయుర్వేద_నవీన్_సలహాలు
జ్వరానికి మనం ఇంటి వైద్యం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో చూసాము కదా, అలాగే, వానాకాలం లో వేరే సాధారణ జబ్బుల బారి నుండి ఎలా బయట పడగలమో తెలుసుకుందాం ఇప్పుడు.
వానా కాలం వచ్చేసింది. వానలు పేదలకు చిన్నలకి, చల్లదనాన్ని సంతోషాన్ని పంచుతాయి. వానల చిరు జల్లుల్లో తడిచి ఆనందాన్ని పొందాలని అందరికి ఉంటుంది. కానీ వర్షాలు వీటన్నిటితో పాటు క్రీములను, ఇన్ఫెక్షన్స్ ను, జబ్బులను కూడా మోసుకొస్తాయి. పిల్లలు వీటి బారిన ఎక్కువగా పడుతుంటారు. ఎంత కాపాడుకున్న రోగాలు తప్పకుండా వస్తాయి. ఆ వానా కాలం రోగాలను నయం చేసే ఆయుర్వేద నవీన్ సలహాలు
దగ్గు_జలుబు_జ్వరం
వాన కాలంలో గాలిలో ఉండే ఇన్ఫ్లుఎంజా వైరస్ ఈ జబ్బులకు కారణం. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు కూడా అంటుకుంటుంది. పసి పిల్లలకు ఎక్కువగా వస్తుంది. అల్లం రసం, గోరు వెచ్చని నీరు, ఒక్క చెంచా తేనే , బాగా కలిపి రోజులో అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే త్వరగా ఉపసమనం లభించును.
విరేచనాలు
తాగే నీటి ద్వారా వైరస్, బాక్టీరియా కడుపులోకి చేరడం విరేచనాలు అవ్వడానికి కారణం. అవి జీర్ణ వ్యస్థను మందగింప చేస్తాయి. పిల్లలు కడుపునొప్పి, వాంతులు, డిహైడ్రాషన్, విరేచనాలతో బాధపడతారు. నిమ్మ రసం, దానిమ్మ రసం వాడటం వలన విరేచనాలు తగ్గును . దానిమ్మ పూర్తిగా కడుపునొప్పిని, విరేచనాలను తగ్గిస్తుంది. 6 నెలల లోపు పిల్లలకు గింజలు పెట్టకూడదు . గొంతులో అడ్డు పడే ప్రమాదం ఉంటుంది .
కళ్ళ_కలక
వర్షా కాలంలో ఎక్కువగా ఉండే బాక్టీరియా, వైరస్ కళ్ళ కలకకు కారణం. ఏది వచ్చినప్పుడు, పిల్లల కళ్ళు ఎర్రగా మారిపోతాయి, కంటి నుండి పుసి కారుతుంటుంది. ఉప్పు నీళ్ళతో కడగడం. కళ్ళ కలకకు ఇదే ఉత్తమమైన వైద్యం. వేడి నీళ్లలో కళ్ళు ఉప్పును కలిపి, దానితో పిల్లల కళ్ళను కడగాలి.
డెంగ్యూ
డెంగ్యూ జ్వరం ఏడెస్ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ రకం దోమలు వానా కాలంలో ఎక్కువగా వస్తాయి. వీలున్నంత వరకు వీటి బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవడం మంచిది. తులసి ఆకులను నీళ్ళలో వేసి కాసేపు మరగనివాలి . ఈ నీటిని పిల్లలకు ఇస్తూ ఉండాలి. అంతే కాకుండా ఆకులను పిల్లల చేత నమిలించాలి
చర్మ_వ్యాధులు
వానా కాలంలో అధికంగా వ్యాపించే క్రిములు, పిల్లలకు ఇన్ఫెక్షన్ లు కలిగించి, చర్మ వ్యాధులకు కారణమవుతాయి.
పసుపు, వేపాకు పేస్ట్ వాడడం వలన చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. వేపాకులో ఎన్నో వైద్య గుణాలు ఉంటాయి. పసుపు వేపాకు కలిపిన పేస్ట్ ను ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో పూయడం వలన వెంటనే ఉపసమనం లభించును.
ఇలా చిన్న చిన్న చిట్కాలు ఇప్పటివి కాదు. తరతరాలుగా వస్తున్నా జ్ఞానం. ఇంటి చిట్కాల ద్వారా వైద్యం చెయ్యడం వల్ల డాక్టర్ కు కట్టే డబ్బులతో పాటు, మానసిక వ్యధని కు నివారించగలుగుతారు.
వీటన్నిటిని పక్కన పెట్టి, అసలు సాధారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగటానికి రోజు కింద వివరించినట్టుగా కొన్ని చిన్న చిట్కాలు తప్పనిసరిగా పాటిస్తే పిల్లల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
నీరు
నీరు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చు అని అందరికీ తెలిసిందే. పిల్లలకు ఎక్కువ నీటిని, ద్రవ పదార్థాలను ఇవ్వడం వలన రోగనిరోధక శక్తి పెరిగి, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
తేనె
ప్రతిరోజూ ఒక స్పూన్ తేనే పిల్లలకు ఇవ్వడం వలన రోగనిరోధక శక్తి పెరిగి జ్వరం,జలుబు,దగ్గు సమస్యలు ఉండవు.
Comment List