తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ : జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 1
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ :
జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 1
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ నెల మూడవ తారీఖున చంద్రుగొండ మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతుందని అని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి అన్నారు వియంబంజర నుండి చంద్రుగొండ మీదుగా కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలు కల్లూరు,తల్లాడ,ఏన్కూరు మరియు జూలూరుపాడు మీదుగా కొత్తగూడెం చేరుకోవాలి.అదే విధంగా కొత్తగూడెం నుండి వీయం బంజర వైపు ప్రయాణించే వాహనదారులు జూలూరుపాడు,ఏన్కూరు,తల్లాడ మరియు కల్లూరు మీదుగా వియం బంజర వైపు ప్రయాణించాలని కోరారు. ట్రాఫిక్ డైవర్షన్ మూడవ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వాహనదారుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు,ఆటంకాలు తలెత్తకుండా,ట్రాఫిక్లో చిక్కుకోకుండా పోలీసు వారు చేపట్టే ట్రాఫిక్ డైవర్షన్ ను గమనించి ప్రజలు సహకరించాలని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ఈ సందర్బంగా తెలియజేసినారు
Comment List