నిజాయితీ చాటుకున్న కండక్టర్ టేక్మాల్. విధి నిర్వహణలో టిఎస్ఆర్టిసి బస్ కండక్టర్
నిజాయితీ చాటుకున్న కండక్టర్
టేక్మాల్. విధి నిర్వహణలో టిఎస్ఆర్టిసి బస్ కండక్టర్ ముదిగొండ రవి, నిజాయితీ చాటారు. బస్సులో ప్రయాణించిన ప్రయాణికురాలు పర్స్ మర్చిపోగా. ఆమె వివరాలు తెలుసుకొని అందజేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ నుండి లింగంపల్లి వైపు వస్తుండగా శంకరంపేట్ బస్టాండ్ లో బొడుమెట్పల్లి వెళ్లేందుకు ప్రయాణికురాలు బస్సు ఎక్కారు. తన స్టేజ్ రావడంతో పర్సు బస్సులో మర్చిపోయారు. ఈ పర్స్ గమనించిన కండక్టర్ ముదిగొండ రవి దాన్ని తెరిచి చూశారు. అందులో వెండి ఉంగరం, 2050 నగదు ఉండడంతో వివరాల కోసం పర్సులో వెతకగా ప్రయాణికురాలు కొడుకు సర్దార్ ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి సమాచారం అందించారు. మళ్లీ రిటర్న్ వెళ్లే ప్రయాణంలో బొడ్మెట్ పల్లి స్టేజ్ వద్ద కు ప్రయాణికురాలు, ఆమె కొడుకు రావడంతో పర్సును అందజేశారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ ను బాధితులు, ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు అభినందించారు.
Comment List