శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై
శ్రీ కోదండ రామాలయంలో ఆండాళ్ తిరునక్షత్ర మహోత్సవం
క్లింకారా న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , జూలై 28
తేదీ. 28.07.2025 సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక శ్రీ కోదండ రామాలయంలో ధర్మాచార్య చల్లా వెంకట్ రెడ్డి శోభారాణి దంపతులు ఆలయ కమిటీ చైర్మన్ జినుకల సురేష్ వారి చాతాధ శ్రీవైష్ణవ సంగం వారి ఆధ్వర్యంలో వారి సౌజన్యముతో శ్రీ నీలా దేవి ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రం పురోహితులు ఎస్పీ. శ్రీనివాస స్వామి, రంగనాధ స్వామి, కృష్ణ చైతన్య వార్ల మధ్య విశ్వక్సెన ఆరాధన గోదా అమ్మవారికి పంచామృత అభిషేకం, విశేష వస్త్ర అలంకరణ తొపాటు వచ్చిన భక్తుల అందరికి అర్చన చేశారు, అశోక నగర్ మహిళ భక్తులు విటి సభ్యులు వడిబియ్యం సమర్పించారు, మహిళలు తోలుత శ్రీ విష్ణు, లక్ష్మి, శ్రీకృష్ణా, రంగనాధ శ్రీ గోదా నీలా దేవి శత నామార్చన, ముప్పది తిరుప్పావై పాశురాలు అనుసంధించారు, ఆనంతరం ఆలయము చుట్టూ శ్రీ గోదాదేవి పల్లకి సేవ మహిళ సభ్యులచే ఉయ్యాల జంపాల పాటలతో కనుల విందుగా చేశారు, రంగనాధ స్వామి, లంకా నిర్మల తదితరులు పాల్గొని అందరికి శ్రీ రామానుజ ట్రస్ట్ వారి ప్రగతి నివేదిక తిరుప్పావై గ్రంధం ఇచ్చారు, ఆనంతరం తీర్ధ ఘోస్థి తొ కార్యక్రమం సుసంపన్నం ఐనది ఇట్టి వేడుకలకు అశోక నగర్ గ్రామస్థులు, ఛాతాధ శ్రీవైష్ణ బంధువులు పాల్గొన్నారు
Comment List