జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 18.07.2025 *• మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో
జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 18.07.2025
*• మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితునికి 5-సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ: 5000/- జరిమానా విధించిన గౌరవ స్పెషల్ పోక్సో జడ్జి శ్రీమతి జయంతి గారు.*
*• నిందితుని శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు.*
నేరం సంఖ్య: 135/2018- సెక్షన్ 376, 511 IPC, సెక్షన్ 12- పోక్సో యాక్ట్, గుమ్మడిదల పోలీస్ స్టేషన్. *వివరాలలోనికి వెళ్లితే:* గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో హిర్యాధి కూతురు వయస్సు 7 సంవత్సరాలు, 2వ తరగతి చదువుతూ, రోజు సాయంత్రం ట్యూషన్ కి వెళ్ళేది, రోజు మాదిరిగానే తేది: 12-11-2018 నాడు సాయంత్రం ట్యూషన్ కి వెళ్ళగా అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న నిందితుడు ఆకుల వీరేశం సమయం అందాజ రాత్రి 7:30 గంటల సమయంలో పిర్యాది కూతురుని తన రూంలోపలికి తీసుకుని వెళ్ళి అత్యాచారం చేయబోయాడని, అట్టి వ్యక్తిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని గుమ్మడిదల పోలీసు స్టేషన్ లో దరఖాస్తు చేయగా అప్పటి యస్.హెచ్.ఒ రాజేష్ నాయక్ ఎస్ఐ కేసు నమోదు చేసి, ఇన్వెస్టిగేషన్ అనంతరం న్యాయ స్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేయగా, కేసు పూర్వపరాలను విన్న గౌరవ స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి శ్రీమతి జయంతి గారు నిందితుడు ఆకుల వీరేశం కు 5-సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ: 5000/- జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
*నిందితుని వివరాలు:* ఆకుల వీరేశం తండ్రి వెంకయ్య, వయస్సు: 37 సంవత్సరాలు, వృత్తి: డ్రైవర్, నివాసం: రాందాస్ గూడ, చిలప్చేడ్ మండల, మెదక్ జిల్లా.
నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్ రెడ్డి, ఇన్వెస్టిగేషన్ అధికారి రాజేష్ నాయక్ ఇన్స్పెక్టర్, ప్రస్తుత ఎస్ఐ భరత్ భూషణ్, కోర్టు డ్యూటీ హెచ్.సి. సురేష్ కుమార్, కోర్ట్ లైజనింగ్ అధికారి హెడ్.కానిస్టేబుల్ శంకర్, కె.సత్యనారాయణ ఎస్ఐ. లను ఎస్పీ గారు అభినందించారు.
Comment List