జూలై 16, 2025 తెలంగాణ సచివాలయం, హైదరాబాద్
జూలై 16, 2025
తెలంగాణ సచివాలయం, హైదరాబాద్
స్థానిక సంస్థల్లో వికలాంగుల ప్రాతినిధ్యం కోసం సీఎం రేవంత్ రెడ్డి తో చర్చిస్తా
సాధన కమిటీకి హామీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు
స్థానిక సంస్థల్లో వికలాంగుల ప్రాతినిధ్యం కోసం వికలాంగులకు ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలోనే ప్రాతినిధ్యం కల్పించేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు తెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిపెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబును స్థానిక సంస్థల్లో వికలాంగుల ప్రాతినిద్య సాధన కమిటీ ప్రతినిధి బృందం కలసి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వంకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా రాష్ట్రంలో 25వేల మంది వికలాంగులకు ప్రజాప్రతినిధులుగా అవకాశం దక్కుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.సాధన కమిటీ చెప్పిన విషయాలను చాలా సానుకూలంగా విన్న మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబును కల్సిన ప్రతినిధి బృదంలో ప్రాతినిధ్య సాధన కమిటీ చైర్మన్ ఎం.డి. షఫీ అహ్మద్ ఖాన్, సలహా దారులు తుడుం రాజేందర్, వైస్- చైర్మన్ దైనంపల్లి మల్లికార్జున్, రాష్ట్ర నాయకులు శబరి చావ్లా, నర్సింహులు, జిల్లా అధ్యక్షులు ఎం. మహేశ్వర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మన్నే పోచయ్య, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్. వెంకట్ తదితరులు పాల్గొన్నారు
Comment List