తుమ్మలను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సామాజిక వర్గ ప్రజలు క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తుమ్మలను కలిసి కృతజ్ఞతలు తెలిపిన
బీసీ సామాజిక వర్గ ప్రజలు
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించడం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న 23 శాతం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతాం అన్న మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్న వేళ ఆదివారం గండుగులపల్లి గ్రామంలో బీసీ సామాజిక వర్గ ప్రజలు దమ్మపేట మండలవాసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి సంతోషం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అనుముల రేవంత్ రెడ్డి, అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ లకు అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మెచ్చుకుంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లికొండ నాగేశ్వరరావు, కెవి సత్యనారాయణ, కాసాని మల్లేశ్వరరావు, నాగప్రసాద్, నాయుడు రాధాకృష్ణ, పానుగంటి లక్ష్మణ్ గౌడ్, పెద్దగౌండ్ల నరసింహారావు, పోలగాని చంద్రం, సురేష్, మారగాని నాగేశ్వరరావు, కందిమళ్ళ నాగప్రసాద్, మేక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comment List